జిల్లా జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎన్‌హెచ్ఏఐ అధికారులు సమక్షం లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాణ పనులకు అడ్డంకిగా మారుతున్న సమస్యలు, రోడ్డు విస్తరణపై ఉన్న కేసులు, సంబంధిత విభాగాల అనుమతుల అంశాలపై వివరంగా సమీక్ష జరిగింది.ఎన్‌హెచ్ఏఐ పిడీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రస్తుత రహదారి పనుల పురోగతిని, సాగుతున్న అనుమతి సమస్యలను కలెక్టర్‌కు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ప్రతి కేసు పూర్వపరాలు తెలుసుకొని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.జాతీయ రహదారులు జిల్లాలో ప్రయాణ సౌకర్యం, రవాణా అభివృద్ధికి కీలకమని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు


Comments