పతకాలతో వెలిగిన సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు.

యూ.సి.ఓ జాతీయ సైబర్‌ ఒలింపియాడ్‌లో ఆల్‌ఇండియా ర్యాంకులు.

పతకాలతో వెలిగిన సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు.

సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

జాతీయ స్థాయి యూనిఫైడ్‌ సైబర్‌ ఒలింపియాడ్‌ పరీక్షల్లో సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య కరికులం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచారు. గత నెల నిర్వహించిన ఈ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో విశేష ఫలితాలు నమోదు చేసి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. దాసరి ఖాస్వి ఏడవ స్థానం, ఆర్‌.కెనీషా పదవ స్థానం, మన్విత పన్నెండవ స్థానం సాధించి నగదు బహుమతులు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రత్యేక ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.

అదే విధంగా బాలుర విభాగంలో తన్షిక్‌ నాయుడు, సాయి చరణ్‌, సాత్విక్‌, హర్ష వర్ధన్‌ మెరుగైన విజయం సాధించి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొందారు. విద్యార్థుల విజయాన్ని పాఠశాల నిర్వాహకులు, ఖమ్మం ప్రాంత సమన్వయకర్త కృష్ణారావు అభినందించారు. “జాతీయ స్థాయి పోటీల్లో చురుకుగా పాల్గొని ప్రతిభను దేశం ముందుంచాల’’ని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ అజిత, డీన్ ఎన్‌.వి‌.ఆర్‌, సి-ఇన్‌ఛార్జ్ నాగార్జున, ఐఎన్‌టీఎస్ఓ ఇన్‌ఛార్జ్ సుభాకర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .