పోలింగ్ పై అవగాహన, అభ్యర్థులకు సూచనలు చేసిన పోలీసులు
Views: 10
On
వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేలేరు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ సిఐ శ్రీధర్ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు సూచనలు చేశారు.ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఓటర్లను డబ్బులు, మద్యంతో ప్రలోభపెట్టే చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూడదని, సామాజిక మాధ్యమాలలో ఒకరిని మరొకరు కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు.
ఇలాంటి చర్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మిన లేదా పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా గ్రామస్థులు, అభ్యర్థులు అందరూ సహకరించాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments