విజయ్ దివస్ వేడుకలలో ఎమ్మెల్యే బండారి కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు) :
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన ఉద్యమ యోధుడు, తెలంగాణ జాతిపిత అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
చిలుకనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో “విజయ్ దివస్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
తరువాత ఎమ్మెల్యే, కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేసి, బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు.ఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ…తెలంగాణ సాధన కోసం ఉద్యమ రథసారథి కేసీఆర్ 2009లో 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేయడం ద్వారా ఢిల్లీని కదిలించి తెలంగాణ ప్రకటన వెలువడేలా చేశారని పేర్కొన్నారు. “ తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజు” అని అన్నారు.కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ…కేసీఆర్ ఉక్కు సంకల్పం ముందుకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చిందని, తెలంగాణ ఏర్పాటుకు ఆయన చేసిన త్యాగం చరిత్రలో అక్షరాలా నిలిచిపోతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు, కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, బస్తీ కాలనీ మహిళలు, ట్రాలీ ఆటో అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


Comments