పోచమ్మ రాళ్ల భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేస్తుండడంతో గ్రామస్తుల ఆందోళన
డీసీపీ నారాయణ రెడ్డి మాటతో గ్రామస్తుల నిరసన విరమణ
మహేశ్వరం, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
మహేశ్వరం నియోజకవర్గ కందుకూరు మండలం బేగరికంచ గ్రామంలో దేవాలయ పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుందనే అనుమానంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోచమ్మ రాళ్ల వద్ద ఉన్న రెండు ఎకరాల భూమిని అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడంతో, 145 సర్వే నంబర్‌లోని మిగతా భూములను కూడా ప్రభుత్వాధీనంలోకి తీసుకుంటారనే భయంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చిన గ్రామస్తుల ఉద్రిక్తతను గమనించిన మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు, ఫార్మా ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులతో చర్చలు జరిపారు.రైతులకు న్యాయం చేస్తామన్న హామీతో, ఏ నిర్ణయమూ రైతుల అనుమతి లేకుండా తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. దీనితో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు.


Comments