నోటి ద్వార థైరాయిడ్ శస్త్రచికిత్స చేసిన లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ వైద్యులు
హైదరాబాద్, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)
హైదరాబాద్‌లోని ఈ.సి.ఐ.ఏల్ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ వైద్యులు మరో అరుదైన, అత్యాధునిక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి వైద్యరంగంలో తమ నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. నోటిద్వారా బయట ఎలాంటి కట్‌లు లేకుండా థైరాయిడ్ గ్రంధిని తొలగించే టోట్వా (ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ థైరాయిడ్ వెస్టిబ్యులర్ యాక్సెస్) పద్ధతిలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న 60 ఏళ్ల రోగి ఆసుపత్రిని ఆశ్రయించగా, పూర్తి స్థాయి రక్తపరీక్షలు, స్కానింగ్, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ మరియు ఇతర అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులునిర్ధారించారు. రోగి ఆరోగ్య స్థితి, థైరాయిడ్ గ్రంధి పరిమాణం, మరియు టెక్నిక్‌కు అనుకూలతను పరిశీలించిన తరువాత అత్యంత నైపుణ్యం అవసరమయ్యే టోట్వా పద్ధతినే ఎంచుకున్నారు.ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే బయట ఎలాంటి కట్లు ఉండవు, మెడపై మచ్చలు కనిపించవు, రికవరీ వేగంగా జరుగుతుంది, ఇన్‌ఫెక్షన్ ప్రమాదం తక్కువ, సర్జరీ తర్వాత నొప్పి చాలా తక్కువ,వైద్యుల సమిష్టి కృషితో శస్త్రచికిత్స విజయవంతమైంది. ముఖ్యంగా నోటి లోపల మూడు చిన్న పాయింట్ల ద్వారా ఎండోస్కోప్‌ను ప్రవేశపెట్టి థైరాయిడ్ గ్రంధిని సురక్షితంగా తొలగించడం ఈ ఆపరేషన్ క్లిష్టత. అయితే తులసి హాస్పిటల్ వైద్యులు అద్భుత నైపుణ్యంతో శస్త్రచికిత్సను పూర్తిచేశారు.ఆపరేషన్ అనంతరం రోగి కేవలం 24 గంటల్లోనే లేచి నడవడం ప్రారంభించడం వైద్య బృందానికి ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వివరించింది.ఈ సందర్భంగా లైఫ్ లైన్ తులసి హాస్పిటల్ చైర్మన్ & చీఫ్ సర్జన్ డా. జె.ఎస్. రాజ్ కుమార్ మాట్లాడుతూ టోట్వా వంటి అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులను హైదరాబాద్ ప్రాంతంలో అందించడం మాకు గర్వకారణం. నోటిద్వారా సర్జరీ చేయడం వల్ల రోగులకు బయట మచ్చలు కనిపించవు. త్వరగానే రోజువారీ జీవనానికి చేరుకోవచ్చు. ఇది మా వైద్యబృందం సమిష్టి కృషి ఫలితం” అని అన్నారు.ఈ శస్త్రచికిత్సలో డా. రాజ్ కుమార్‌తో కలిసి డా. కల్నల్ కె.ఆర్. రావు, డా. కరుణాకర్, డా. ప్రఫుల్, డా. భార్గవ పాల్గొన్నారు.అత్యాధుని క ఆపరేషన్ థియేటర్‌లు, ఇటీవలి సాంకేతిక పద్ధతులు,అనుభవజ్ఞులైన వైద్యుల బృందం తులసి హాస్పిటల్ ను హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌గా నిలబెట్టాయి.రోగులకు నైపుణ్యంతో కూడిన, విశ్వసనీయ వైద్య సేవలను అందించడంలో తులసి హాస్పిటల్నిరంతరం ముందంజలో ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


Comments