మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి

మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి

పెద్దమందడి, డిసెంబర్‌ 13 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామపంచాయతీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మద్దతుదారు శివ యాదవ్‌పై 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ మద్దతుదారు ఓటమి పాలవ్వగా, శ్రీనివాస్ గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ గ్రామంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం వారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .