ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష

ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష

హైదరాబాద్, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 13న జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సి పాల్గొనే ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాట్లపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి గురువారం ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.డిజిపి, రాచకొండ సిపి సుధీర్ బాబు తో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, మ్యాచ్ నిర్వాహకులతో కలిసి స్టేడియంలో ప్రత్యక్షంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.డిజిపి మాట్లాడుతూ, మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లియోనల్ మెస్సికి ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కఠినంగా ఉండాలని సూచించారు. ప్రేక్షకులకు సంబంధించి భద్రతా మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, ఇందుకోసం మెట్రో రైళ్లు, నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
అధికారులు స్టేడియం భద్రతా అనుకూలతలను డిజిపికి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి, దాదాపు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం కలిగివుందని తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్— నాలుగు ప్రధాన సెక్టర్లుగా విభజించామని వివరించారు.ప్రతిష్టాత్మక ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ను లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిజిపి సూచించారు.సమీక్షా సమావేశంలో అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్, ఎస్పీఎఫ్ డిజి స్వాతి లక్రా, అదనపు డిజిపి చారు సిన్హా, ఇంటెలిజెన్స్ అదనపు డిజిపి విజయ్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఎన్‌సీబీ ఎస్పీ పద్మజ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీచైర్మన్ కె. శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. IMG-20251211-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!