బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
నేరేడ్మెట్, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
జిహెచ్ఎంసి పునర్విభజనలో భాగంగా ఇప్పటి వరకు మల్కాజిగిరి డివిజన్‌గా ఉన్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒకదానికి బలరాంనగర్, మరొకదానికి సఫిల్గూడా పేర్లు అమలు చేయడం స్థానిక నేరేడ్మెట్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.ఈ నేపథ్యంలో నేరేడ్మెట్ వాసులు పెద్ద సంఖ్యలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ “ఎన్నో ఏళ్లుగా నేరేడ్మెట్ అనే పేరుతో గుర్తింపు ఉన్న ప్రాంతానికి బదులు బలరాంనగర్ అనే కొత్త పేరును పెట్టడం మాకు ఏ విధంగానూ ఆమోదం కాదు” అని స్పష్టం చేశారు.డివిజన్ పేరును బలరాంనగర్‌గా కాకుండా నేరేడ్మెట్ డివిజన్‌గా మార్చాలని హాజరైన గ్రామ పెద్దలు, స్థానికులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. అదే విధంగా, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో నేరేడ్మెట్‌కు టికెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.సమావేశంలో ఎం. బాలలింగం, చాకో, పీ.బీ. సుందర్ యాదవ్, తుపాకుల జనార్దన్, గంగాధరి కృష్ణ, జీ. శ్రీనివాస్ యాదవ్, ఎల్లిమెల గణేష్, బళ్లారి అశోక్, సానాది శంకర్, తుపాకుల కోటేశ్వర్, టి. మురళీ గౌడ్, కటికల నరేష్, ఈ. నందు యాదవ్, ఏ.ఎల్. లక్ష్మీపతి, మోర శ్రికాంత్, జే. శివ, పీ. ఈశ్వర్ యాదవ్, బీ. ఈశ్వర్ గౌడ్, జీ. రమేష్, ఏ. రాజు, పీ. శ్రీసైలం, ఎస్. రాజ్ గౌడ్, సూరి, ఎల్లిమెల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments