ఆశీర్వదించండి.అభివృద్ధి చేసి చూపిస్తా.
జయగిరి సర్పంచ్ అభ్యర్థి తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు.
హాసన్ పర్తి, డిసెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా చివరి రోజు ప్రచారంలో సందర్బంగా జయగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డప్పుసప్పుల్లతో,కోలాటలతో సర్పంచ్ అభ్యర్థి తాళ్లపెల్లి వెంకటేశ్వర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు,కులాలకు అతీతంగా నాకు మద్దతుగా ఉన్న గ్రామ ప్రజలకు కష్ట సుఖలలో అండదండగా ఉంటానని గ్రామంలో ప్రధాన సమస్య కోతుల బెడదతో మహిళలు,చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని కోతుల సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.బతుకమ్మ స్థలం కబ్జా కావడంతో జయగిరి మహిళలు రోడ్డు మీద బతుకమ్మ ఆడుతున్నారని వచ్చే బతుకమ్మ వరకు స్వంత బతుకమ్మ స్థలంలో బతుకమ్మను ఆడించి జయగిరి మహిళల ఆత్మగౌరాన్ని నిలబెడతనని గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని పేర్కొన్నారు.


Comments