అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం

పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శనివారం అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తన నివాస కార్యాలయంలో సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డితో పాటు ఉప సర్పంచ్ బాబు నాయక్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని పేర్కొన్నారు. సర్పంచ్‌గా ఎన్నికైన గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డి గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో ముందుండాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమర్థవంతమైన పాలన అందించాలని కోరారు.ఈ సందర్భంగా సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, అలాగే అమ్మపల్లి గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!