స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కు మూడు జాతీయ పురస్కారాలు.
---పురస్కారాలు అందుకున్న పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య.
---సర్వత్రా అభినందనల వెల్లువ.
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు)
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కు మూడు జాతీయ పురస్కారాలు లభించాయి. హైదరాబాద్ హైటెక్స్ లో బ్రెయిన్ ఫీడ్ సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆరవ జాతీయ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ టెక్ ఎక్స్పో -2025 పురస్కారాల ప్రధానోత్సవాల కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు స్కూల్ ఎక్సలెన్సీ పురస్కారం, ట్రయిల్ బ్లేజర్ పురస్కారం, పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య కు బెస్ట్ ఎడ్యుకేషన్ నిస్ట్ పురస్కారం లభించాయి.ప్రముఖ బాలీవుడ్ నటుడు , వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆశిష్ విద్యార్థి చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 13 ఏళ్లుగా పాఠశాల విద్యార్థులను ఆటపాటలతో , సృజనాత్మకతతో తీర్చిదిద్దుతున్నందుకు గాను , పాఠశాలలో విద్యార్థులకు పలు విద్యా వనరులతో విద్యా బోధన అందిస్తున్నందుకు గాను, చిన్నారుల విద్య పట్ల అంకితభావంతో కృషి చేస్తున్నందుకు గాను ఈ జాతీయ పురస్కారాలు లభించాయి. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పురస్కారంతోపాటు , కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య కు ఉత్తమ విద్యాసంస్థ నిర్వాకునిగా పురస్కారం అందుకున్నందుకు పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పాఠశాల తల్లిదండ్రులు, పలు విద్యాసంస్థల కరస్పాండెంట్లు అభినందనలు తెలిపారు.


Comments