మైనర్‌పై వేధింపులు… ఇద్దరు యువకులు రిమాండ్
సత్తుపల్లి టౌన్‌లో ఘటన.
Views: 43
On
సత్తుపల్లి, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో మైనర్ బాలికను వెంటపడి వేధించిన ఇద్దరు యువకులపై సత్తుపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానికంగా నివసిస్తున్న బాలికను ప్రేమించమంటూ పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా (షరీఫ్) అనే యువకులు పలుమార్లు వెంటపడి వేధించారు. అంతేకాకుండా బెదిరించి దాడి చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించి, శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం వారిని సత్తుపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments