పీచరలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
వేలేరు, 25 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మంతపురి రాజు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి – రేవంతన్న కానుకగా మహిళా సంఘాలకు చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ జల్తారి సంపత్ మాట్లాడుతూ – “గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లోపం ఉండడంతో ఆడపడుచులు వాటిని ఉపయోగించలేకపోయారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచి నాణ్యతతో కూడిన, ఉపయోగపడే చీరలను తయారు చేయించి మహిళలకు అందిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యతతో కూడిన కానుకను అందిస్తోంది” అని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జల్తారి సంపత్, పెద్ది నగేష్, జల్తారి శ్రీనివాస్, భైరబోయిన గట్టయ్య, అవునూరి మల్లయ్య, గుండెల్లి అనిల్, పాము జగదీశ్, సమ్మయ్య తదితరులు పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. నాయకులు మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.


Comments