కొమ్మేపల్లి కాలనీలో క్రైస్తవ ప్రార్థనా మందిరం నిర్మాణం.
సింగరేణి సౌజన్యంతో.
సత్తుపల్లి, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి సంస్థ ఆర్ అండ్ ఆర్ అభివృద్ధి కార్యక్రమాల భాగంగా కొమ్మేపల్లి కాలనీలో 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని శుక్రవారం సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు.
ప్రార్థనా మందిర నిర్మాణానికి సింగరేణి సి అండ్ ఎండి ఎన్. బలరాం, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (పి&పీ) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పిఏ అండ్ డబ్ల్యూ) గౌతమ్ పొట్రు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమలరావు, సత్తుపల్లి ఏరియా జీఎం సిహెచ్. శ్రీనివాస్ తదితరులు సహకారం అందించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఏరియా జీఎం చిహ్నాల శ్రీనివాస్, జెవిఆర్ ఓసీ ప్రాజెక్టు అధికారి ఎన్విఆర్ ప్రహ్లాద్, మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఏఎంసీ చైర్మన్ ఆనంద్ బాబు, ఏరియా పర్యావరణ అధికారి తోట సత్యనారాయణ, ఉప ఇంజనీర్ (సివిల్) ఏ. రవికుమార్, సంక్షేమ అధికారి కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొమ్మేపల్లి కాలనీ నివాసులైన మరసకట్ల దేవదాసు, పచ్చినీళ్ల ఇర్మియ, బి. రెడ్డి కృష్ణారెడ్డి, ఎస్.కే. సుభాని, పి. శ్రీను, ఎస్.కే. బాజీ, ఎస్.కే. షఫీ తదితరులు ప్రార్థనా మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


Comments