దుర్గామాత దేవాలయం నవమ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్
Views: 3
On
మల్లాపూర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ డివిజన్ కే.ఎల్. రెడ్డి నగర్ కాలనీలోని శ్రీ దుర్గామాత దేవస్థానంలో నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడుతున్నాయి. బుధవారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో దేవస్థాన కమిటీ సభ్యులు, కే.ఎల్. రెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి నిండిన వాతావరణాన్ని సృష్టించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments