ఉప ముఖ్యమంత్రిని కలిసిన చలసాని.
విద్యా సమస్యలపై చర్చ.
Views: 8
On
సత్తుపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను విద్యాసంస్థల అధినేత చలసాని సాంబశివరావు శనివారం కలిసి వివరణ ఇచ్చారు.
జిల్లాలో విద్యాసంస్థలు కొనసాగుతున్న విధానంలో తలెత్తుతున్న అడ్డంకులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యాలు, అనుమతుల సమస్యలు తదితర అంశాలపై వివరమైన నివేదికను చలసాని అందజేశారు.
సమావేశం అనంతరం మంత్రి బట్టి స్పందిస్తూ, జిల్లాలో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలో దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో చలసాని సాంబశివరావుతో పాటు ప్రైవేట్ పాఠశాల జిల్లా నాయకుడు నాయుడు వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments