కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి  129 ఫిర్యాదుల స్వీకరణ

కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి  129 ఫిర్యాదుల స్వీకరణ

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 129 ఫిర్యాదులు స్వీకరించామని అదనపు కలెక్టర్ ‌ డి. విజయేందర్ రెడ్డి తెలిపారు. డిఆర్ఓ హరిప్రియ తో కలిసి ఆయన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని అధికారులు గుర్తు చేశారు.ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే క్లియర్ చేయాలని, ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇంకా, సిఎంఓ ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారుIMG-20251201-WA0009

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .