గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన పోలీసులు.
కల్లూరు డివిజన్‌లో రయట్ కంట్రోల్ డ్రిల్లులు.
సత్తుపల్లి, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు డివిజన్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. అల్లర్ల నియంత్రణకు సంబంధించి శనివారం విస్తృతంగా రయట్ కంట్రోల్ డ్రిల్లులు నిర్వహించారు. ఏసిపి వసుంధర యాదవ్ సూచనల మేరకు డివిజన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు.
స్టేషన్ల వారీగా ఎస్‌హెచ్‌ఓలు సిబ్బందిని సమీకరించి ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్రిల్లులో భాగంగా షీల్డ్ ఫార్మేషన్‌లు, అడ్వాన్స్–రిట్రీట్ కదలికలు, లాఠీ హ్యాండ్లింగ్, జనం నియంత్రణ చర్యలు వంటి అంశాలను అధికారులు అభ్యసించారు. ప్రజా శాంతిభద్రతల పరిరక్షణలో బలగాల సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వేగం పెంపుకు ఈ శిక్షణ దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. డ్రిల్లులను ఏసిపి వసుంధర యాదవ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎన్నికల డ్యూటీల్లో ఎలాంటి స్థితిగతులనైనా సమర్థంగా ఎదుర్కొనేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.


Comments