గ్రామాభివృద్ధికి డబ్బుల రాజకీయాలు వద్దు.
సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకురాలు నాగమణి. - అన్ని పార్టీల నేతలకు ఒకే సలహా.
దమ్మపేట, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నట్టు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకురాలు గంగాధర నాగమణి తెలిపారు.
ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, లేదా ఇతర పార్టీల నాయకులు అందరూ ఒక గ్రామ కమిటీగా కూర్చొని, ప్రజల ముందే చేయబోయే అభివృద్ధి పనులను స్పష్టంగా చెప్పాలని కోరారు.
డబ్బులు పంచడం, వస్తువులు పంచడం, అమాయక ఓటర్లకు ఆశలు చూపించడం వంటి పద్ధతులు గ్రామాలను వెనుకబెడతాయని ఆమె అన్నారు.
“ఎవ్వరి పార్టీ అయినా సరే… డబ్బులు పంచి గెలవాలనే రాజకీయాలు ఆగాలి. అభివృద్ధి పనులతోనే ఓట్లను కోరండి. గ్రామం ముందుకు వెళ్లాలంటే ఇదే మార్గం” అని నాగమణి స్పష్టం చేశారు.
పెద్దలు, ప్రజలు, ప్రతి పార్టీ శ్రేణులు ఈ సలహాను ఆలోచించి, స్వచ్ఛమైన ఎన్నికలకు సహకరించాలని ఆమె అభిలాష వ్యక్తం చేశారు.


Comments