ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో డాక్టర్ రామారావు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో డాక్టర్ రామారావు.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 21, తెలంగాణ ముచ్చట్లు;

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రామారావు  వైద్యులతో అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని పిహెచ్ సీ ను ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. వైద్యం తీసుకుంటున్న రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు.ప్రతిరోజు వైద్యశాలకు వచ్చు ఓ.పి లను అడిగి తెలుసుకొన్నారు.ల్యాబ్ టెస్ట్ లు ఏవిధంగా నిర్వహస్తున్నారు,డెలివరీస్ కి సంభందించిన అన్ని రికార్డ్స్,హాస్పిటల్ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. పిహెచ్సీ ఫార్మసీని ప్రత్యేకంగా పరిశీలించి, ఏ మందులు అందుబాటులో ఉన్నాయో, ఏవి కొరతలో ఉన్నాయో, రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారో స్వయంగా చెక్ చేశారు. అనంతరం మెడికల్ అధికారి డాక్టర్ బోడ వసుంధర నుంచి సేవల అమలు, స్టాక్ వివరాలు, వైద్య సిబ్బంది హాజరు వంటి అంశాలపై నివేదిక తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ పిహెచ్సీ లో డెలివరీలు చేస్తూ,అలాగే ప్రతి ఒక్కహై రిస్క్ కేసును తప్పనిసరిగా తిరుమలాయపాలెం సిహెచ్సికి రిఫర్ చేయాలని హెచ్చరించారు.ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తిరుమలాయపాలెం సిహెచ్సిలో గైనకాలజిస్ట్‌తో పాటు అన్ని అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయంటూ వెల్లడించారు.IMG-20251121-WA0153

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్