సత్తుపల్లి నుంచి వాడపల్లి కి డీలక్స్ సర్వీస్ ప్రతి శుక్రవారం.!
డిపో మేనేజర్ ఊటుకూరి సునీత.
సత్తుపల్లి, డిసెంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రం వాడపల్లికి భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పిస్తూ ప్రతీ శుక్రవారం డీలక్స్ బస్సు నడపనున్నట్టు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు సత్తుపల్లి బస్టాండ్ నుంచి డీలక్స్ బస్సు వాడపల్లికి బయలుదేరుతుంది. దర్శనానంతరం తదుపరి రోజు ఉదయం 8 గంటలకు వాడపల్లి నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. ప్రయాణ చార్జీలను పెద్దలకు ₹630, పిల్లలకు ₹340గా నిర్ణయించామని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ సదుపాయం కల్పించామని, 68515 రిజర్వేషన్ కోడ్ ఉపయోగించి టికెట్లు పొందవచ్చని చెప్పారు.
మరిన్ని వివరాల కోసం 9866619189, 9550767375, 9959225962 నంబర్లను సంప్రదించవచ్చని సునీత సూచించారు. సత్తుపల్లి పరిధిలోని భక్తులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Comments