కవులు కళాకారులు కాదు,విద్యార్థి ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ   రాష్ట్రం లేదు 

కవులు కళాకారులు కాదు,విద్యార్థి ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ   రాష్ట్రం లేదు 

 -అప్పటి విద్యార్థి జేఏసీ చైర్మన్,మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి

బషీర్బాగ్,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు, కళాకారుల కంటే విద్యార్థి ఉద్యమకారుల పాత్ర అత్యంత కీలకమైందని అప్పటి విద్యార్థి జేఏసీ చైర్మన్,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమావేశం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో విద్యార్థులు పోషించిన త్యాగాలు, పోరాటమే తెలంగాణకు పునాది అని స్పష్టం చేశారు.
విద్యార్థులు లేకపోతే ఉద్యమం నిలబెట్టలేకపోయేదని, రాష్ట్రం ఆవిర్భావంలో యువజన శక్తి పోషించిన పాత్రను చరిత్ర మరవలేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులకు తగిన గౌరవం, గుర్తింపు ప్రభుత్వాలు కల్పించకపోవడం విచారకరమన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు ఉద్యమకారుల కోటాలో పింఛన్ తక్షణమే అందించాలని రవి డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమ నాయకులపై నమోదైన పెండింగ్ కేసులను పూర్తిగా ఎత్తివేయాలని కోరారు.ఈ నెల డిసెంబర్ 9న దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ, కేయూ విద్యార్థి నాయకులకు రాజకీయ రంగంలో, ప్రభుత్వ వ్యవస్థలో సముచిత స్థానం కల్పించకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా భారీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాములు నేత మాట్లాడుతూ, ప్రభుత్వ భూములపై తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే హక్కు ఉందని, ఉద్యమకారులకు ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేయకపోవడం ఆందోళనకరమన్నారు. ఒక్క సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చే విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.ఈ సమావేశంలో యాకూబ్ రెడ్డి, దామోదర్, ఫరూక్, జేకె, శ్రీనివాస్ రెడ్డి, ఒస్మానియా నాయకులు ఎంఢీ రహీం, హనుమంతరావు, అస్మక్ శంకర్, సాంబశివ గౌడ్, రమణ, స్టాలిన్, ఉపేందర్, గుంటీ ప్రభాకర్, బోరెల్లి సురేష్, గణేష్ ముదిరాజ్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్