ఎల్కతుర్తిలో రాజ్యాంగ విశిష్టతపై వ్యాసరచన పోటీలు
ఎల్కతుర్తి, నవంబర్ 22 : (తెలంగాణ ముచ్చట్లు)
హుస్నాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండలం మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు భారత రాజ్యాంగ విశిష్టతపై వ్యాసరచన పోటీలు శనివారం నిర్వహించినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందేలా గొప్ప పోరాటాలు చేశారని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం హిందూ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టి, స్త్రీలకు సమాన హక్కులు, ఉద్యోగాల్లో వాటా దక్కేలా రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.
జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ డేగల సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఈ నెల 26న అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు.
కార్యక్రమాన్ని దస్తరి ఉమామహేశ్వర్, చుంచు ఐలయ్యలు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ వి. లలిత, ఉపాధ్యాయులు ఆర్. కిరణ్, ఆర్. కళ్యాణి, జి. రాజమణి తదితరులు పాల్గొన్నారు.


Comments