ఫోన్ వదలండి… పుస్తకం పట్టండి
గ్రంథాలయాన్ని పరిశీలించిన విశ్వశాంతి విద్యార్థులు.
సత్తుపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రంధాలయాలు జ్ఞానానికి నిలయాలు. పుస్తకాలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఫోన్ వదలండి... పుస్తకం పట్టండి. 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు సత్తుపల్లి శాఖా గ్రంధాలయాన్ని సందర్శించారు. అక్కడ వివిధ రకాల అరుదైన పుస్తకాలను, చారిత్రక గ్రంథాలను పరిశీలించారు. వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కథలు పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, చరిత్ర సంస్కృతి, ప్రముఖుల విజయ గాదులకు పుస్తకాలను పరిశీలించారు. పుస్తక ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా గ్రంథపాలకులు మల్లికార్జున రావు మాట్లాడుతూ… “గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు… విజ్ఞాన భాండాగారాలు. బుక్ రీడింగ్‌తో విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ వ్యసనము వదిలి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి’’ అని సూచించారు. విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ… “జ్ఞానానికి నిలయమైన గ్రంథాలయం అందరికీ ఉచితంగా జ్ఞానం అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.


Comments