కేటీఆర్‌పై జరుగుతున్న కుట్రలను సహించేది లేదు

వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ  యూత్ ఇంచార్జ్ ఇట్టబోయిన సంపత్

కేటీఆర్‌పై జరుగుతున్న కుట్రలను సహించేది లేదు

వేలేరు, 22 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

కేటీఆర్‌పై సాగుతున్న కక్షసాధింపు చర్యలను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ఇకపై అలాంటి ప్రయత్నాలను సహించబోమని వేలేరు మండల బిఆర్ఎస్ పార్టీ  యూత్ ఇంచార్జ్ ఇట్టబోయిన సంపత్ అన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్ల సహాయంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అదే విధమైన దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. గవర్నర్‌పై ఒత్తిడి చేసి కేటీఆర్‌పై కేసులు పెట్టే ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థపై నేరుగా దాడి చేయడమేనని సంపత్ అభిప్రాయపడ్డారు.

ఎలాంటి కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజల మద్దతు తమతో ఉందని, న్యాయస్థానాలపై పూర్తిగా నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహించాలని, లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తన నిర్ణయం తెలియజేస్తారని ఆయన హెచ్చరించారు.వేలేరు మండలంలో జరిగిన సమావేశంలో సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .