బిఆర్ఎస్వి నూతన కమిటీకి కార్పొరేటర్ బన్నాల శుభాకాంక్షలు
చిల్కానగర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ సర్కిల్ బిఆర్ఎస్విలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి తదితర కమిటీ సభ్యులకు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్, బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వినయ్‌కుమార్ యాదవ్, కార్యదర్శి వరుణ్ గౌడ్, ఉపాధ్యక్షుడు చంద్రధర్ మరియు ఇతర కమిటీ సభ్యుల ఎన్నుక ఎంతో శుభపరిణామం అని అభివర్ణించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్వి జిల్లా కమిటీ సభ్యులు హేమ నాథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు అభినవ్, సుజిత్, సాయి తదితరులు పాల్గొన్నారు.


Comments