వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
ఎల్కతుర్తి, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
వికలాంగ అనాధ చిన్నారుల అభ్యున్నత కోసం సేవలు అందిస్తున్న ఎస్‌ఆర్‌ఎస్ బ్లైండ్ అండ్ డెఫ్ ఖమ్మం సంస్థకు సెయింట్ థామస్ అల్టిట్యూడ్ విద్యార్థులు మానవ దృక్పథంతో 15,216 ఆర్థిక సహాయం అందించారు.
స్వచ్ఛంద సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చిన విద్యార్థులు తమలోని మానవతా విలువలను ప్రతిబింబిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, “విద్యార్థులకు ఆటపాటలతో పాటు సేవాభావాన్ని పెంపొందించడం మా ప్రధాన బాధ్యత. అల్టిట్యూడ్ విద్యార్థులు ఎల్లప్పుడూ అద్భుతాలు సాధించడంలో ముందుంటారు. ఈరోజు చేసిన సేవా కార్యక్రమం మా పాఠశాలకు గర్వకారణం” అని పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌ఎస్ సంస్థకు విద్యార్థులు అందించిన సహాయంపై ఎల్కతుర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారి సేవాభావాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్, హెడ్‌మాస్టర్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రే తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, ఆశా బేగం, సురేష్, గీత, శ్రావణి, స్వప్న, శ్వేత, అనుష, మమత, కవిత, కావ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


Comments