ఘనంగా నారాయణా ప్రీమియర్ లీగ్ – జోనల్ క్రీడా సమ్మేళనం.

విద్యతో పాటు క్రీడా రంగంలోనూ విద్యార్థుల ప్రతిభ.

ఘనంగా నారాయణా ప్రీమియర్ లీగ్ – జోనల్ క్రీడా సమ్మేళనం.

సత్తుపల్లి, నవంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):

నారాయణా విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన “నారాయణా ప్రీమియర్ లీగ్ – జోనల్ స్పోర్ట్స్ మీట్” ఖమ్మం లోని ఎస్.ఆర్ మరియు బి.జి.ఎన్.ఆర్ మైదానాలలో ఎంతో ఉత్సాహభరితంగా, క్రీడాస్ఫూర్తితో సాగింది. పాల్వంచ, సత్తుపల్లి, ఖమ్మం ఓ.ఎన్.సి.ఎస్, ఖమ్మం ఇ.ఎన్.సి.ఎస్ శాఖలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు.

కార్యక్రమానికి ఏ.జి.యం ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపారు. ఆయన మాట్లాడుతూ, నారాయణ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందుండాలి. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి అని అన్నారు.

అలాగే హైస్కూల్ సమన్వయకర్త ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు రామ్ మూర్తి, రేఖ, నరసింహరావు, అమల కూడా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ క్రీడా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి పాల్గొనే విద్యార్థి ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగాలని వారు సూచించారు.

జోనల్ స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడంలో శారీరక విద్య ఉపాధ్యాయులు చందు, వీరు, గోపిరాజు, వినయ్ కీలకపాత్ర పోషించారు. విభిన్న జోన్ల మధ్య జరిగిన ఉత్సాహ

పూర్వక పోటీలు, విద్యార్థుల క్రీడాస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది.

పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు, ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.

IMG-20251108-WA0094

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .