అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ

అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ

పెద్దమందడి,నవంబర్07( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి సహకారంతో కొత్త 25 డ్యూయల్ డెస్క్ బెంచీలు మరియు 3 గ్రీన్ చాక్ బోర్డులు పాఠశాలకు గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేయబడ్డాయి.

గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ముఖ్యమని, పేద విద్యార్థుల అభ్యాసానికి ఇలాంటి సహకారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సహకారంతో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ప్రోత్సాహం పొందుతారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బోయని రమేష్ యాదవ్, గ్రామస్తులుIMG-20251107-WA0059 బాలు, అర్జునయ్య, బాలరాజు, పంచాయతీ కార్యదర్శి మధు గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .