ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన

ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన

పఠాన్‌చెరు,నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజేపీ ఐనోల్, అల్లాదుర్గ్ బీసీ గురుకులంలో వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్రవంతి మాట్లాడుతూ..వందేమాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశప్రేమను రగిలించిన ఉద్యమ నినాదమని పేర్కొన్నారు. వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో ఈ గీతాన్ని రాశారని, “వందే మాతరం” అంటే మాతృభూమికి వందనం అని అర్థమని తెలిపారు.

వందేమాతరం గీతం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కోట్లాది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించిందని స్రవంతి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు స్మారకోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ రేఖ, ఉపాధ్యాయులు, పీడీ, పీఈటీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .