భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
ముప్పు శ్రీనివాస్ రెడ్డి
నాగారం, నవంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం గోధుమకుంట ఎలిఫెంట్ ఎంక్లేవ్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు
.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు నా వంతు కృషి కొనసాగుతుంది” అని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో గోధుమకుంట మాజీ ఎంపిటిసి మంచాల కిరణ్, జ్యోతి, ప్రవీణ్ కుమార్, కీసర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమతి, మాజీ వార్డ్ మెంబర్ చీర శేఖర్, కందాడి శ్రీనివాస్ రెడ్డి, చీర శ్రీశైలం, కాలనీ అధ్యక్షులు నాగభూషణం, కోశాధికారి రాహుల్, ప్రసాద్, రాజేష్, అనిల్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పలు మంది పాల్గొన్నారు.


Comments