నాచారం పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు
మిఠాయిలు పంపిణీ చేసిన ఎస్.ఎస్.ఎస్ యువసేన నాయకుడు సంతోష్ రెడ్డి
నాచారం, అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు):
దీపావళి పండుగను పురస్కరించుకుని ఎస్.ఎస్.ఎస్ యువసేన వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మరియు మాజీ సైనికుడు మామిడాల సంతోష్ రెడ్డి నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బందికి మిఠాయిలు, టపాకాయలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణం కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, వారి సేవలు దేశానికి పునాదుల వంటివి అని పేర్కొన్నారు. సమాజం సురక్షితంగా ఉందంటే అది పూర్తి రీతిగా పోలీస్ కృషికి కృతజ్ఞతలు తెలిపే సూచన అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాచారం కాంగ్రెస్ సీనియర్ నేత మామిడాల రాజా రెడ్డి, ఇంటెలెక్చువల్ ఫోరమ్ జేఏసీ కన్వీనర్ రాంబాబు, ఎస్.ఎస్.ఎస్ యువసేన సభ్యులు ముసుకుల లోకేందర్ రెడ్డి, మహేష్, లక్ష్మణ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీవన్, సాయి ప్రసాద్, విజయ్ సింగ్, అరెల్లా శ్రీధర్, అక్షంత్ పడాల, రాజు, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments