వేంసూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.!
రైతు సంక్షేమమే లక్ష్యం.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి .
సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా వేంసూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వేంసూరు మేజర్ పంచాయతీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు.
రైతుల సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం సన్న రకం వరి క్వింటాకు ₹2,389, దొడ్డు రకం వరి క్వింటాకు ₹2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనంగా సన్న రకానికి క్వింటాకు ₹500 బోనస్ అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజమైన మద్దతు ఇస్తోందని అన్నారు.
రైతుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కృషి వల్ల ఈ పథకం అమలు సాధ్యమైందని రాగమయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు, ఏపీఎం, ఏఈఓలు, పోలీస్ అధికారులు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments