ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పెద్దమందడి సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

పెద్దమందడి,నవంబరు01(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలం పరిధిలోని జగత్ పల్లి, మణిగిల్ల, మోజర్ల, మదిగట్ల గ్రామాల్లో శనివారం వరి కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించారు.

సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో రైతులు తమ పంటను కేంద్రాల వద్ద విక్రయించి, మధ్యవర్తులపై ఆధారపడకుండా న్యాయమైన ధర పొందవచ్చని అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా  మండలంలో వరి సేకరణ సులభతరం అవుతుంది, రైతులకు ఆర్థిక సౌకర్యం కలుగుతుంది అని అన్నారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. WhatsApp Image 2025-11-01 at 8.22.08 PM

ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు  ప్రసాద్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు విట్టా శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ జగదీశ్వర్ రెడ్డి, పి.ఎ.సి.ఎస్ ఉపాధ్యక్షులు బిట్లీ కుమార్ యాదవ్, మాజీ ఎంపీటీసీ చాపల సత్యారెడ్డి,మాజీ సర్పంచ్ పుట్టమోని నారాయణ,రాములు గౌడ్, విజయ్ గౌడ్, హరి చందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రఘుమా రెడ్డి,రమేష్ యాదవ్,ఏవో చెన్నారాయుడు, సొసైటీ ఇంచార్జీలు పంతుల శివ రెడ్డి, అరవింద్ చారి,బాలస్వామి రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!