వడ్డెర్లకు గుట్టలపై హక్కులు కల్పించాలి
జిల్లా అధ్యక్షులు దాసర్ల భూమయ్య
పెద్దమందడి,నవంబర్02తెలంగాణ ముచ్చట్లు):
వడ్డెరలకు గుట్టలపై హక్కులు కల్పించాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు దాసర్ల భూమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన వడ్డెర గ్రామ నూతన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను భూమయ్య అభినందించారు. అనంతరం గ్రామంలో వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ..ఎన్నో ఏళ్లుగా కులవృత్తి ఆధారంగా జీవనం సాగిస్తున్న వడ్డెరలను దేవర్ల గుట్టపై రాయి కొట్టకుండా నిషేధించడం అన్యాయమని విమర్శించారు. దేవర్ల గుట్టపై చెట్లు నరికినా, మట్టి తీయినా ఫారెస్ట్ అధికారులకు కనిపించదా అని ప్రశ్నించారు. సాధారణ వడ్డెరపై మాత్రమే చర్యలు ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో అసంపూర్తిగా ఉన్న వడ్డెర కమ్యూనిటీ హాల్ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. వడ్డెరుల హక్కుల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. వడ్డెరుల కులవృత్తికి చేయూతగా ప్రభుత్వం గుట్టలపై హక్కులు కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మనిగిళ్ళ వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి క్రిష్టగిరి వెంకటయ్య, నాయకులు ఈశ్వర్, శేఖర్, గణేష్ చెంద్రయుడు, గ్రామ అధ్యక్షులు యం. కురుమన్న, ప్రధాన కార్యదర్శి మొగులయ్య, రామకృష్ణ, ఆంజనేయులు, బాలయ్య, యాదయ్య, కురుమయ్య, నాగరాజు, వెంకటేష్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments