జర్నలిస్ట్ వృత్తికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించేది లేదు.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తిరుమలాయపాలెం అధ్యక్షులు సత్యనారాయణ.

జర్నలిస్ట్ వృత్తికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించేది లేదు.

ఖమ్మం బ్యూరో,నవంబర్.2, తెలంగాణ ముచ్చట్లు;

స్వప్రయోజనాల కొరకు ప్రయత్నిస్తూ వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ పాల్పడుతూ జర్నలిస్టు వృత్తికి చెడ్డపేరు తెచ్చే విధంగా పాల్పడే వారిని సహించేది లేదని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తిరుమలాయపాలెం ప్రెస్ క్లబ్ చైర్మన్ పసలాది సత్యనారాయణ తెలిపారు. తిరుమలాయపాలెంలో ఆదివారం ప్రెస్ క్లబ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలను విస్మరిస్తున్న జర్నలిస్టులు గుజ్జ రామకృష్ణ. గోవింద వెంకట్. మేకల నాగరాజు లను తిరుమలాయపాలెం ప్రెస్ క్లబ్ నుంచి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. విలేకరులు నిస్వార్ధంగా నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారానికి వార్తల ద్వారా కృషి చేయాలని కోరారు. పరిశోధనాత్మక కథనాలు సమస్య ఆత్మక కథనాలు మానవీయ కథనాలు రాసి విలేకరులు మంచి పేరు తెచ్చుకోవచ్చని ఆయన వివరించారు. విలేఖరి వృత్తి అనేది ఆర్థిక సంపాదనతో కూడుకున్నది కాదని ఇతర వృత్తుల్లో పనిచేసుకునే వారు కూడా జర్నలిస్ట్ గా కొనసాగడం తప్పేమీ కాదని ఆయన వివరించారు. మంచి వార్తలు రాసే దమ్మున్న విలేఖరికి ఎప్పటికీ మంచి పేరు ఉంటుందని విలేకరు రాసే వార్తలను ప్రజలు అధికారులు గమనిస్తుంటారని గ్రహించాలని సూచించారు. తప్పుడు వార్తలు రాస్తూ టార్గెట్ చేసుకొని కొందరిని బ్లాక్ మెయిల్ కు ప్రయత్నిస్తూ విలేకరులకు చెడ్డ పేరు తెచ్చే వారిపై అవసరమైతే అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా తమ ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పోలెపొంగు నాగరాజు, సహాయ కార్యదర్శి కొలిశెట్టి వేణు, యడవల్లి నాగరాజు,ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు బోడపట్ల సతీష్,నవిల బాబు,పోలే పొంగు వెంకన్న,గోవింద సురేష్,ఎల్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!