మూడు దశాబ్దాలైనా వంగవీటి మోహనరంగ జ్ఞాపకం చెరగలేదు.

మూడు దశాబ్దాలైనా వంగవీటి మోహనరంగ జ్ఞాపకం చెరగలేదు.

- మూడున్నరేళ్ల ఎమ్మెల్యే.
- ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు.
.
సత్తుపల్లి, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

కేవలం మూడున్నరేళ్లపాటు ఎమ్మెల్యేగా సేవలందించిన వంగవీటి మోహనరంగ మరణించి మూడు దశాబ్దాలు గడిచినా ఆయన పేరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని, ఆయన తనయుడు విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. ఆదివారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ 7 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం పట్టణంలో సుమారు 400 ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. WhatsApp Image 2025-11-02 at 5.43.08 PMఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, నా తండ్రి వంగవీటి మోహనరంగ కేవలం మూడున్నరేళ్లపాటు ఎమ్మెల్యేగా సేవలందించినా, ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. కాపు శక్తి ఏకం అయితే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదగగలము అన్నారు.

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ, రాజ్యాధికారమే లక్ష్యంగా కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి అన్నారు. జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కాపులంతా ఒకే తాటిపై నడిస్తే సమాజం బలపడుతుంది అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగ ప్రజానాయకుడు. ఆయన ఆశయాలు ఈ తరాలకు స్ఫూర్తినిస్తాయి అన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు వంగవీటి మోహనరంగ అని పేర్కొన్నారు.

తరువాత రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ ఆవరణలో జరిగిన వన సమారాధన కార్యక్రమంలో పలువురు నాయకులు మున్నూరు కాపు కుల ఐక్యత, అవునత్యం, సమాజాభివృద్ధి గురించి వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు శెట్టి రంగారావు, పసుపులేటి దేవేందర్, గోవిందు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పార నాగేశ్వరరావు, నర్సయ్య, మంజుల, గుంటుపల్లి శ్రీదేవి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, ప్రముఖ వైద్యులు గండికోట రమాకాంత్, కొండూరి రామ్ హరీష్, రామిశెట్టి సుబ్బారావు, తోట సుజల రాణి గణేష్, పి.ఎల్. ప్రసాద్, సుంకర వాసు, పెద్దిరెడ్డి పురుషోత్తం, బత్తుల రాంబాబు, జల్లిపల్లి మురళి, నల్లాకుల సూరిబాబు, వి.ఎం.ఆర్. యూత్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!