హైదరాబాద్ పోలీసు వ్యవస్థ పనితీరును సమీక్షించిన సీపీ వీసీ సజ్జనర్
అధునాతన సాంకేతికత వినియోగంతో సమర్థవంతమైన సేవలందించాలన్న సూచన
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి,సిబ్బందికి సీపీ సూచన
ఉత్తమ సేవలందించిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని హామీ
హైదరాబాద్,అక్టోబర్30(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గురువారం ఐసీసీసీ లోని కమిషనర్ కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరును స్వయంగా పరిశీలించారు. టవర్ ‘ఏ’ లోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూమ్ తదితర విభాగాలను సందర్శించి సిబ్బంది పనితీరును వివరంగా ఆరా తీశారు.మెయిన్ పీసీఆర్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాట్రోలింగ్ మేనేజింగ్ వ్యవస్థను సమీక్షించిన ఆయన, పాట్రోలింగ్ వాహనాల రియల్ టైం కదలికలను పరిశీలించారు..jpeg)
డయల్ 100కు వచ్చే కాల్స్‌పై స్పందన, రెస్పాన్స్ టైమ్, సేవల సామర్థ్యం వంటి అంశాలను గమనించారు.
ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ విధి నిర్వర్తనలో నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ అత్యంత ముఖ్యం అని సిబ్బందికి సూచించారు. అవసరం మేరకే సిబ్బందిని వినియోగించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ పనితనాన్ని మెరుగుపరచుకోవాలని సూచించిన ఆయన, ఉత్తమ సేవలందించే సిబ్బందిని గుర్తించి వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.


Comments