కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, నవంబర్ 2 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని కాప్రా చెరువు అలుగు నుంచి ఎల్లారెడ్డిగూడ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు, శ్రీ సాయి శివ నగర్ ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని తెలిపారు. కాలనీల్లో ఉన్న రహదారులు, డ్రైనేజ్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత అధికారులతో కలిసి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.‘‘ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనికి నిరంతరం శ్రమిస్తాను’’ అని ఎమ్మెల్యే చెప్పారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక వాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments