చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.

చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.

 ఆరు లక్షల విలువ గల 40 గ్రాముల బంగారు ఆభరణాలు,50 గ్రాముల వెండి ఆభరణాలు,56వేల నగదు స్వాధీనం.

 హసన్ పర్తి,నవంబర్ 01(తెలంగాణ ముచ్చట్లు)

కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరదిలో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు కేయూసి సిఐ ఎస్. రవికుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లా, వాంకిడి, తేజిగూడ గ్రామానికి చెందిన విద్యార్థి సిండే అరుణ్ కుమార్ తండ్రి రామయ్య(25) వరంగల్ లో 2022 సంవత్సరంలో చదువు పూర్తి చేసుకుని సంవత్సరం వరకు ఇంటి వద్దనే ఉండి 2024 సంవత్సరంలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవడానికి హనుమకొండకు వచ్చి కొద్ది రోజులుగా గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకునే క్రమంలో బెట్టింగ్ లకు బానిసై అప్పు ఎలా తీర్చాలో తెలియక దొంగతనాలు చేయడం ప్రారంభించాడని సీఐ తెలిపారు. ఈ క్రమంలో గోపాల్పూర్, భీమారం ఏరియాలలో తాళం వేసిన ఇంటిని గుర్తించి రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. నిందితుడు సుమారు పది నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడని ఈ కేసులలో 40 గ్రాముల బంగారు ఆభరణాలు,50 గ్రాముల వెండి ఆభరణాలు, 56,400 రూపాయలు మొత్తం సుమారు 6 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు.ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్ళకు వెళ్లేటప్పుడు పక్క ఇంటి వారికి గాని లోకల్ పోలీసుల కు గాని తెలుపాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ రవికుమార్ సూచించారు.వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసిరిన దొంగను చాలెంజ్ గా తీసుకొని ఇట్టి కేసులను తొందరగా చేదించిన కేయూసి ఎస్సైలు పి.శ్రీకాంత్,కె నవీన్ కుమార్, క్రైమ్ సిబ్బంది అహ్మద్ పాషా, రాజశేఖర్,జితేందర్,సిసిఎస్ వరంగల్ సిబ్బంది టీ.మధు,ఈ.చందు లను కేయూసీ సీఐ అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!