అంగన్వాడీ సెంటర్లకు 8 నెలల కిరాయి బకాయిలు వెంటనే చెల్లించాలి

అంగన్వాడీ సెంటర్లకు 8 నెలల కిరాయి బకాయిలు వెంటనే చెల్లించాలి

మల్కాజిగిరి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి ప్రాంతంలోని వినాయక నగర్‌లో అంగన్వాడీ సిబ్బంది తమకు రావాల్సిన కిరాయిలు, కూరగాయలు, గ్యాస్ బిల్లులు చెల్లించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం నిరసన తెలిపారు. అంగన్వాడీ టీచర్ల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జిల్లా కార్యదర్శి బి. శోభారాణి మాట్లాడుతూ,"మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు ఎనిమిది నెలలుగా కిరాయిలు రాలేదు. ఇంటి యజమానులు సెంటర్లకు తాళం వేస్తామని హెచ్చరిస్తున్నారు. టీచర్లు తమ జీతాల నుంచి కూరగాయలు, గ్యాస్ ఖర్చులు భరించారు కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిసారీ అంగన్వాడీ సిబ్బందిపై ఒత్తిడి, బెదిరింపులు మాత్రమే చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రభుత్వమే ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆమె గుర్తుచేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్‌గా టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు జియో రాలేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!