పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి.    

అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే పూలే విగ్రహంపైదాడి.

పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి.    

 వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్.  

హాసన్ పర్తి,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ ఉర్సు కరీమాబాద్ సెంటర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సోమవారం రాత్రి కొంతమంది దుండగలు ధ్వంసం చేయగా బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు.ఈ సందర్బంగా బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మూడు శతాబ్దాల క్రితమే వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప త్యాగశీలైనటువంటి జ్యోతిరావు పూలే   విగ్రహాన్ని కొంతమంది దుండగలు విధ్వంసం చేయడం బాధాకరమని,బీసీ ఉద్యమం ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే వెనుక ఉండి ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారని అలాంటి వ్యక్తులను గుర్తించి పోలీస్ లు కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే కొత్త పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే బీసీ జేఏసీ ఉపేక్షించదు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్,బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ దొడ్డపల్లి రఘుపతి,జేఏసీ సభ్యులు కురుమిళ్ల శ్రీనివాస్ గౌడ్,చాగంటి రమేష్,  సమ్మయ్య,పూజారి విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!