గాంధీ భవన్‌లో తెలంగాణ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగం ప్రారంభం

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

గాంధీ భవన్‌లో తెలంగాణ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగం ప్రారంభం

వనపర్తి,అక్టోబర్‌30(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగం ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ అధికారి సుధాకర్, సివిల్ సొసైటీ జాతీయ అధికారి నవికా, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రొఫెషనల్ వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడం, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగ అభివృద్ధి, యువతకు అవకాశాల సృష్టి వంటి పలు అంశాలపై సమావేశంలో ఉపయోగకరమైన సూచనలు వెలువడ్డాయి.

డా. జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ..ప్రొఫెషనల్ వర్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. ఈ వేదిక ద్వారా యువత తమ ఆలోచనలను విధాన రూపకల్పనలో భాగస్వామ్యం చేసుకోవడం ముఖ్యం అని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!