బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్
మిక్కిలినేని మనూ చౌదరి (ఐ.ఏ.ఎస్)
నాగారం,అక్టోబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, వెస్ట్‌సైడ్ భోగారం ను గురువారం రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి ఐ.ఏ.ఎస్. సందర్శించారు.
ఈ సందర్బంగా విద్యార్థినులతో మమేకమై, వారి విద్యా ప్రగతి, శిక్షణా కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు క్రమశిక్షణ, కృషి, ధైర్యంతో చదువుకుని సమాజంలో మార్పు తేవగల శక్తిగా ఎదగాలని సూచించారు.
.ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ వెంకట్ ఉపేందర్ రెడ్డి,నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్, బోధన సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి, సంస్థ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై విస్తృతంగా చర్చ జరిగింది.విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, సమాన విద్యా అవకాశాలు అందించడంలో ప్రభుత్వ సంకల్పాన్ని కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి పునరుద్ఘాటించారు.


Comments