ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి  ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి  ఆత్మహత్య

వేలేరు, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన రేణ శ్రీనివాస్ (52) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కూలీ పనితో వచ్చే ఆదాయం సరిపోక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.వెంటనే కుమారుడు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!