ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులు సమర్పించిన: ఎమ్మెల్యే జారె.
అశ్వారావుపేట, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృషి కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్వీకరించిన 120 దరఖాస్తులను సంబంధిత అధికారులకు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉపశమనాన్ని పొందేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జారె తెలిపారు.
అలాగే వైద్య చికిత్స అవసరమున్న ప్రతి అర్హత కలిగిన కుటుంబం తమ వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అందజేయాలని సూచించారు. వారికి ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య సహాయం అందేలా తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.


Comments