పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి.

ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి.

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి.

అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు.

హాసన్ పర్తి, అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు):

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. ఆర్. నాగరాజు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా  హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి ఎమ్మెల్యే నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారుని అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి,యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుందని ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి,సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోహసన్ పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి,హసన్ పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షుడు గౌరు రాజి రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి,చాందరాజు సంతోష్,  మల్లాడి తిరుపతి రెడ్డి,వీరబోయినరవి,బైరిసునీల్,లింగారెడ్డి,రవి,స్వర్ణలత,రావుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారుIMG-20251021-WA0011

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .