మర్రిగూడాలో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మల్లాపూర్, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యంఇస్తున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మర్రిగూడా కాలనీలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీలో డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ సమస్యతో పాటు ఎన్‌ఎఫ్‌సీ నుంచి వచ్చే కలుషిత మురుగు నీటి సమస్యను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రైల్వే మరియు ఎన్‌ఎఫ్‌సీ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, జలమండలి మేనేజర్ వేణుగోపాల్, వంగేటి సంజీవ రెడ్డి, పెద్ది సంజీవ రెడ్డి, బాల్ రెడ్డి, నరేష్, అంజిరెడ్డి, బోదసు లక్ష్మీనారాయణ, తండా వాసుగౌడ్, తిగుళ్ల శ్రీనివాస్, నాగరం బాబు, అల్లాడి కృష్ణ యాదవ్, చిన్న దుర్గయ్య, నాగేందర్, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు


Comments