నియోజకవర్గంలో పంట నష్టం పై సమీక్షా సమావేశం.!
- మొందా తుఫాన్ ప్రభావం.
- రైతుల సమస్యలపై చర్చ.
సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు, సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు (ఏఓలు), సహాయక వ్యవసాయ అధికారులు (ఏఈఓలు) పాల్గొన్నారు.
మొందా తుఫాన్ ప్రభావం వలన తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించి, రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల ఏఓలు, ఏఈఓలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని, గత సీజన్‌లో చోటు చేసుకున్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
రైతుల పక్షాన పలు అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించబడింది. సత్తుపల్లి నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి నివేదికను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రికి పంపించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


Comments